ETV Bharat / state

పెట్రోల్​ దాడి బాధితులను కాపాడిన పోలీసులపై.. డీఐజీ ప్రశంసలు - విజయనగరం

విజయనగరం జిల్లాలో పెట్రోల్ దాడి బాధితులను కాపాడిన పోలీసులపై విశాఖ రేంజ్​ డీఐజీ రంగారావు ప్రశంసల జల్లు కురింపించారు. దిశా కాల్​కు వెంటనే స్పందించి వర్షాన్ని లెక్కచేయకుండా.. బాధితులను ఆసుపత్రికి తరలించారని అభినందించారు.

డీఐజీ రంగారావు
డీఐజీ రంగారావు
author img

By

Published : Aug 21, 2021, 8:18 PM IST

విజయనగరం జిల్లాలో పెట్రోల్ దాడి బాధితులను కాపాడిన పోలీసులను విశాఖ రేంజ్​ డీఐజీ రంగారావు ప్రశంసించారు. ఆ పోలీసులకు ప్రోత్సాహక నగదు, ప్రశంసాపత్రాలు అందించారు. దిశ కాల్‌కు సమాచారం వచ్చిన వెంటనే పోలీసులు స్పందించారని అన్నారు. త్వరగా ఘటనాస్థలానికి వెళ్లి బాధితులను ఆస్పత్రికి తరలించారని తెలిపారు. వర్షాన్ని లెక్క చేయక 25 కిలోమీటర్ల దూరాన్ని 21 నిమిషాల్లోనే పోలీసులు చేరుకుని ఆటోలో భోగాపురం ఆస్పత్రికి తరలించారని తెలిపారు.

ఏం జరిగిందంటే..

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చౌడువాడలో యువతిపై ఓ యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన సంచలం సృష్టించింది. అడ్డుకోబోయిన యువతి అక్క, ఆమె కుమారుడికి.. గాయాలయ్యాయి. ముగ్గురినీ విజయనగరం జిల్లా ఆస్పత్రికి బాధితుల్ని హుటాహుటిన తరలించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తి నరవ ప్రాంతానికి చెందిన రాంబాబుగా పోలీసులు గుర్తించారు.

రాంబాబు, బాధిత యువతి కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఇరు కుటుంబాలు సైతం వీరి పెళ్లికి అంగీకరించాయి. అయితే.. ఇటీవల ఆ యువతి వేరే యువకుడితో మాట్లాడుతోందని అనుమానిస్తూ రాంబాబు.. పెళ్లి రద్దు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గురువారం రాత్రి 2 కుటుంబాలకు పోలీసుల సమక్షంలో రాజీ కుదిరింది. పోలీసుల సూచనతో వివాహం చేసుకునేందుకు యువకుడు అంగీకరించాడు. ఆ తర్వాత అర్ధరాత్రి సమయంలో దారుణానికి ఒడిగట్టి.. దాడి అనంతరం పరారయ్యాడు. ఆ సమయంలో.. దిశ యాప్ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. బాధితులను సత్వరమే ఆస్పత్రికి తరలించి.. ప్రశంసలు అందుకున్నారు.

ఇదీ చదవండి:

పెళ్లి కుదిరినా.. అనుమానం పెరగడంతోనే హత్యాయత్నం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.