ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వైకుంఠ ద్వారం ద్వారా వెంకటేశ్వర స్వామిని భక్తులు దర్శనం చేసుకున్నారు. స్వామిని అర్చకులు సుప్రభాత సేవతో మేల్కొలిపి అనంతరం ఆరాధన సేవా కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహుకులు, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు, చలువ పందిళ్లలను అధికారులు ఏర్పాట్లు చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో వైకుంఠ ద్వార దర్శనం.. పోటెత్తిన భక్తజనం