మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విజయనగరం కార్పొరేషన్లో ఇంటింటి ప్రచారం జోరుగా సాగుతోంది. ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా అభ్యర్థులు హామీలు ఇస్తున్నారు. తనను గెలిపిస్తే పట్టణ ప్రాంతాల్లో ఆస్తి విలువ ఆధారంగా ప్రవేశపెట్టిన పన్ను రద్దుకు కృషి చేస్తానంటూ.. కార్పొరేషన్ పరిధిలోని 33వ డివిజన్ అభ్యర్థి రెడ్డి శంకరరావు ప్రచారం చేస్తున్నారు. రెడ్డి శంకరరావు.. సీపీఎం తరపున పోటీ చేశారు.
రాబోయే రోజుల్లో మరుగుదొడ్లకు కూడా పన్ను విధించేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు చేస్తోందన్నారు. తనను కార్పొరేటర్‌గా గెలిపిస్తే కార్పొరేషన్లో తనవంతుగా ప్రభుత్వ పన్నుల విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతానని హామీ ఇస్తున్నారు.
ఇదీ చూడండి: పాత నోటిఫికేషన్ ప్రకారమే ఎన్నికలు: హైకోర్టు