ETV Bharat / state

మిమ్స్​ నుంచి కరోనా బాధితులు డిశ్చార్జ్​: ఇంటికి చేరిన ఆరుగురు!

author img

By

Published : Jun 20, 2020, 10:49 AM IST

విజయనగరం మిమ్స్ నుంచి కరోనా బాధితులు ఆరుగురు డిశ్చార్జ్ అయ్యారు. వీరితో కలిపి.. వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య.. 55కు పెరిగింది.

Corona victims discharge
మిమ్స్​ నుంచి కరోనా బాధితులు డిశ్చార్జ్​

విజయనగరం జిల్లా చీపురుప‌ల్లి, తెర్లాం, ద‌త్తిరాజేరు, మెర‌క‌ముడిదాం, మెంటాడ‌ త‌దిత‌ర మండ‌లాల‌కు చెందిన ఐదుగురు పురుషులు, ఒక మ‌హిళ‌ను మిమ్స్​ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్​ చేశారు. ప‌దిరోజుల క్రితం కరోనా సోకిన వీరిని ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స‌ అందించారు. నిరంత‌రంగా వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌, స‌రైన చికిత్స‌, కౌన్సిలింగ్ చేయ‌డం వల్ల కొద్దిరోజుల్లోనే వీరంతా వైర‌స్ నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు.

రెండు సార్లు వీరికి ప‌రీక్షలు నిర్వహించిగా నెగిటివ్ అని తేలింది. ప్ర‌భుత్వం త‌రఫున ఒక్కొక్క‌రికి రూ.2 వేలు న‌గ‌దు, అవ‌స‌ర‌మైన మందులు, డ్రైఫ్రూట్స్‌ ఇచ్చి పంపించారు. ఆసుప‌త్రి మెడిక‌ల్ ఆఫీస‌ర్ డాక్ట‌ర్ హ‌రి కిష‌ణ్ సుబ్ర‌మ‌ణ్యం ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ వీడ్కోలు కార్య‌క్ర‌మంలో మిమ్స్ సూప‌రింటెండెంట్​ డాక్ట‌ర్ ర‌ఘురామ్‌, ప్రిన్సిపాల్ ల‌క్ష్మీకుమార్‌, ఆర్ఎంఓ డాక్ట‌ర్ వ‌ర్మ‌రాజు, డాక్ట‌ర్ సాగ‌ర్‌, ఏఓ గ‌ణేష్‌, వెల్ఫేర్ ఆఫీస‌ర్ గిరిబాబు త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:

ఎయిర్​పోర్ట్​ విస్తీర్ణం తగ్గించడం.. రైతులను మోసం చేయడమే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.