ETV Bharat / state

పెరుగుతున్న కరోనా కేసులు.. అప్రమత్తమైన అధికారులు - corona latest news update

కర్ఫ్యూ సమయంలో రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. విజయనగరంలో కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. ఏస్పీ ఆదేశాల మేరకు ఉదయం ఏడు గంటలకు ముందు రోడ్లపైకి వచ్చే వాహనదారులకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.

corona cases increased
విజయనగరంలో అప్రమత్తమైన అధికారులు
author img

By

Published : May 29, 2020, 1:21 PM IST

విజయనగరం జిల్లాల్లో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా అధికారులు కఠినంగా లాక్​డౌన్​ అమలు చేస్తున్నారు. ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ అమలుపై పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఎస్పీ రాజకుమారి ఆదేశాల మేరకు వివిధ ప్రాంతాల్లో ఉదయం 7 గంటలకు ముందు వచ్చే రోడ్లపైకి వచ్చే వాహనాలను నిలుపుదల చేసి, కర్ఫ్యూ నిబంధనల గురించి వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. కర్ఫ్యూ విధించిన సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం డీఎస్పీ వీరాంజనేయ రెడ్డి, ట్రాఫిక్ డీఎస్పీ, సీఐ ఎర్రన్నాయుడు పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఇవీ చూడండి...

రైతులకు అందుబాటులోకి ఇంద్రావతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.