తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్(సీహెచ్డబ్ల్యూ ) విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో సబ్ ప్లాన్ మండలాల్లోని వర్కర్స్ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం సీఐటీయూ నాయకులు మాట్లాడారు. గిరిజన గ్రామాల్లో 1100 మంది సీహెచ్డబ్ల్యూలుగా పని చేస్తున్నారన్నారు. వారందరికీ పాత జీతం నాలుగు వందలతో పాటు.. 2020 సెప్టెంబర్ నుంచి కొత్త వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వర్కర్స్ అందరికీ ఏకరూప దుస్తులు, గుర్తింపుకార్డులు ఇవ్వాలని కోరారు. తమ డిమాండ్లను వీలైనంత త్వరగా పరిష్కరించాలని.. లేకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామన్నారు.
ఇదీ చదవండి: ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో పీడీఎఫ్ అభ్యర్థులు.. ఏపీటీఎఫ్ మద్దతు