విజయనగరం జిల్లాలో పార్వతీపురం ప్రాంత అభివృద్ధి వేదిక సమావేశం నిర్వహించారు. భాస్కర కళాశాలలో ఏర్పాటుచేసిన ఈ సమావేశంలో పలు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. పార్వతీపురం జిల్లా కేంద్రంగా చేయాలని వారు డిమాండ్ చేశారు.
కేంద్రానికి అవసరమైన అన్ని వసతులు అర్హతలు పార్వతీపురానికి ఉన్నాయని వారు అభిప్రాయపడ్డారు. గిరిజన ప్రాంతాలకు ముఖ ద్వారంగా ఉన్న పార్వతీపురంని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తే ప్రాంతం అభివృద్ధికి అవకాశం ఉంటుందన్నారు. భౌగోళిక పరిపాలన పరంగా ఈ ప్రాంతానికి జిల్లా కేంద్రం చేసేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని వివరించారు. జిల్లా కేంద్రం సాధనకు అన్ని వర్గాలు కలసి కృషి చేయాలని నిర్ణయించారు.