కరోనా నేపథ్యంలో పదో తరగతి పరీక్షల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏర్పాట్లుపై విజయనగంర కలెక్టర్ శాఖల వారీగా సమీక్షించారు. పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఈ ఏడాది రాయనున్న 30,369 మంది విద్యార్ధులకు 221 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అదే విధంగా 2,600 గదులను సిద్ధం చేశామన్నారు. విజయనగరం జిల్లా కలెక్టర్ హరి జవహర్లాల్తో జరిగిన సమీక్షలో డీఈవో నాగమణితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
![collector review meeting with officials about 10th class exams conducting in vijayanagaram district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7666749_144_7666749_1592477626906.png)
ఇదీ చదవండి : స్వచ్ఛంద సంస్ధల ప్రతినిధులకు సత్కారం