కరోనా వ్యాప్తి నియంత్రణలో పోలీసులు ప్రజలకు రక్షణగా నిలిచారని.. ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ కొనియాడారు. పౌర సన్మాన కమిటీ, దళిత బహుజన శ్రామిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.చిట్టిబాబు ఆద్వర్యంలో.. వారికి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విజయనగరంలోని శ్రీదేవి దండు మారమ్మ కళ్యాణ మండపంలో ఈ వేడుకలకు వేదికైంది.
కొవిడ్ సమయంలో పోలీసులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా.. వైరస్ వ్యాప్తిపై వివిధ రూపాల్లో అవగాహన కల్పించారని ఎమ్మెల్సీ ప్రశంసించారు. వారు సమాజానికి చేస్తున్న సేవపై గీతాన్ని ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా గ్రీన్ జోన్‌గా నిలవడానికి కృషి చేసిన ఎస్పీ రాజకుమారి, పొలీసు అధికారులు, సిబ్బందికి.. శాలువాలు కప్పి, జ్ఞాపికను అందజేసి సత్కరించారు.
ఇదీ చదవండి: గరివిడిలో భారీగా ఖైనీ, గుట్కా పట్టివేత..ఇద్దరు అరెస్ట్