విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామంలోని రేషన్ దుకాణాల్లో మండల ప్రత్యేక అధికారి రామ్మూర్తి ఆకస్మిక తనిఖీలు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సరకులు సక్రమంగా అందుతున్నాయా.. లేదా అని వినియోగదారులను అడిగి తెలుసుకున్నారు. రేషన్ దుకాణాల్లోని తూనికలను పరిశీలించారు. కరోనా వ్యాప్తి కారణంగా రేషన్ దుకాణాలకు వచ్చే వినియోగదారులు భౌతిక దూరం పాటించేటట్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో శానిటైజర్, తాగునీరు ఉంచాలని డీలర్లకు సూచించారు.
ఇదీ చదవండి: సరిహద్దుల్లో తలెత్తే ఎలాంటి పరిస్థితికైనా వాయుసేన సిద్ధం