విజయనగరం జిల్లా చీపురుపల్లిలో బీఎస్ఎన్ఎల్ ఆఫీసులో నకిలీ ఆధార్ కార్డుల ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. నకిలీ ఆధార్ కార్డుల విషయంపై.. ఎమ్మార్వో ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వ పథకాల్లో లబ్ధి పొందేందుకు ఆధార్ కార్డులో ఉన్న వయస్సును మార్పిడి చేస్తున్నట్లు గుర్తించినట్లు పోలీసులు వివరించారు. ఆధార్ కార్డులో మోసాలకు పాల్పడుతున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన నలుగురిని అరెస్టు చేసినట్లు వివరించారు. వయస్సు మార్చటం కోసం ఒక్కొక్కరి నుంచి 3 వేల రూపాయలు వసూలు చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: విజయనగరంలో క్రికెట్ బెట్టింగ్.. 9 మంది అరెస్టు