ETV Bharat / state

వాలంటీర్లు రైతులపై పెత్తనం చేస్తారా?: చంద్రబాబు - విజయనగరంలో చంద్రబాబు పర్యటన

CBN MET FARMERS : టీడీపీ హయాంలో రైతులకు 2014-2019 వరకు స్వర్ణయుగమని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి కోటలో ఇదేం ఖర్మ.. రైతులకు సదస్సులో ఆయన పాల్గొన్నారు. రైతుల పంటను మొబైల్‌ ద్వారా నేరుగా అమ్ముకోవడానికి అవకాశమిచ్చామన్నారు. రైతు పండించే పంట నేరుగా వినియోగదారుడికి చేరేలా చేశామని తెలిపారు.

CBN MEETING WITH FARMERS
CBN MEETING WITH FARMERS
author img

By

Published : Dec 24, 2022, 4:17 PM IST

CBN MET FARMERS IN BOBBILI: దేశానికే అన్నం పెట్టిన రాష్ట్రం ఏపీ అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఇదేం ఖర్మ మన రైతులకు సదస్సులో ఆయన పాల్గొన్నారు. తెదేపా హయాంలో రైతులకు స్వర్ణయుగంగా ఉండేదని పేర్కొన్నారు. రైతులు పండించే పంట నేరుగా వినియోగదారుడికి చేరేలా చర్యలు తీసుకున్నామన్నారు. పంటకు గిట్టుబాటు ధర రాకపోతే రైతులను అన్ని విధాలా ఆదుకున్నట్లు తెలిపారు. డ్వాక్రా సంఘాలను పంపించి కల్లాల వద్దే కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. సింగిల్‌ విండో విధానం ద్వారా రైతులకు కావాల్సింది ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో నీటిపారుదలకు రూ.1,550 కోట్లు ఖర్చు పెట్టామన్నారు.

రైతులపై వాలంటీర్లు పెత్తనం చేస్తారా? అని నిలదీశారు. ఆర్బీకేలను ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. జగన్‌ ప్రభుత్వంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర దక్కిందా? అని విమర్శించారు. పోలవరాన్ని గోదావరిలో కలిపేశారని మండిపడ్డారు. టీడీపీ అనేక వ్యవస్థలను ప్రక్షాళన చేసినట్లు తెలిపారు. పాత వ్యవస్థలను ఎప్పుడూ రద్దు చేయలేదని పేర్కొన్నారు. రైతుల పంటను మొబైల్‌ ద్వారా నేరుగా అమ్ముకోవడానికి అవకాశమిచ్చామని తెలిపారు. దేశంలోనే వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ పెట్టింది టీడీపీ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

వాలంటీర్లు రైతులపై పెత్తనం చేస్తారా?: చంద్రబాబు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.