ETV Bharat / state

వైకాపా నేతలకు విశాఖలోని ఆస్తులపైనే ప్రేమ: చంద్రబాబు - విజయనగరం పర్యటనలో చంద్రబాబు

Chandrababu Fire on YSRCP: నా బాధ, ఆవేదన అంతా ప్రజల భవిష్యత్తు గురించేనని చంద్రబాబు విజయనగరంలో స్పష్టం చేశారు. వైకాపా నేతలకు విశాఖలోని ఆస్తులపైనే ప్రేమ.. విశాఖలోని రుషికొండను పూర్తిగా ధ్వంసం చేశారన్నారు. విశాఖలోని దసపల్లా భూములను కొట్టేశారన్నారు. జగన్‌ కొట్టేసిన భూముల విలువ రూ.40 వేల కోట్లు ఉంటుదని ఆరోపించారు.

babu fire on ysrcp
babu fire on ysrcp
author img

By

Published : Dec 24, 2022, 10:37 PM IST

Updated : Dec 25, 2022, 6:30 AM IST

విజయనగరంలో చంద్రబాబు

Chandrababu Fire on YSRCP: రాష్ట్రానికి ఏ ముఖ్యమంత్రి చేయని ద్రోహం జగన్మోహన్‌రెడ్డి చేస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రాంతీయ విధ్వేషాలు రెచ్చగొడుతూ...రాష్ట్రాన్ని తగులబెడుతున్నారని మండిపడ్డారు. విజయనగరంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. జగన్‌కు భయం పుట్టించేందుకు ఇంటికొక పసుపు జెండా ఎగరెయ్యాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రాన్ని దోచుకుంటున్న ముఖ్యమంత్రి జగన్‌కు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని తెలుగుదేశం శ్రేణులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. విజయనగరంలో మూడో రోజూ "ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. భారీ రోడ్ షో నిర్వహించారు. కోట వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలుగుదేశాన్ని గెలిపించేందుకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

నమ్మి ఓట్లేసిన ప్రజలకు జగన్ నమ్మకద్రోహం చేశారని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రాన్ని అసమర్ధ పాలనతో తగలబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడున్నరేళ్లలో ఎక్కడా తట్ట మట్టి వెయ్యని జగన్.. బాదుడే బాదుడుతో ప్రజలను కోలుకోలేని దెబ్బతీశారని ఆక్షేపించారు.

వైసీపీ నాయకులకు విశాఖ కంటే అక్కడి ఆస్తులపైనే ప్రేమ ఎక్కువని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రుషికొండను బోడికొండ చేశారని మండిపడ్డారు. విశాఖలో జగన్ 40 వేల కోట్ల విలువైన భూములను కొట్టేశారని ఆరోపించారు.

వైసీపీ ప్రభుత్వంలో 60 మంది సలహాదారులుంటే ఉత్తరాంధ్ర నుంచి ఒక్కరూ లేరన్నారు. టీటీడీ బోర్డులోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా జీతాలు ఇవ్వలేని ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేసి తప్పుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రాజధాని విషయంలో నాటకాలు కట్టిపెట్టాలని హెచ్చరించారు.

నీతి నిజాయితీకి మారుపేరైన అశోక్‌ గజపతిరాజుపై అక్రమ కేసులు పెట్టించారని చంద్రబాబు ధ్వజమెత్తారు. అక్రమ కేసులు పెట్టించిన వారిని వదిలిపెట్టబోనని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చాక రెట్టింపు సంక్షేమపథకాలు అందజేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. వైకాపా తప్పుడు ప్రచారాలను నమ్మొద్దన్నారు.

పరిశ్రమలను తరిమేశారు..

విజయనగరం జిల్లాకు తీసుకొచ్చిన పరిశ్రమలను జగన్ తరిమేశారని చంద్రబాబు మండిపడ్డారు. మూడేళ్ల పాలనలో జగన్ విధ్వంసం సృష్టించారని ఆరోపించారు. ఇంటిపన్ను, వృత్తిపన్ను, తాగునీటి ఛార్జీలు పెంచారని మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులు పూర్తి చేయడం లేదని.. రైతులను నిలువునా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పరిపాలనలో ఎవరూ ఆనందంగా లేరన్న చంద్రబాబు.. రైతులకు పూర్వ వైభవం తీసుకొస్తానని హామీ ఇచ్చారు.

వైసీపీ నేతలకు విశాఖలోని ఆస్తులపైనే ప్రేమ. విశాఖలోని రుషికొండను పూర్తిగా ధ్వంసం చేశారు. విశాఖలోని దసపల్లా భూములను కొట్టేశారు. జగన్‌ కొట్టేసిన భూముల విలువ రూ.40 వేల కోట్లు. కలెక్టరేట్‌, తహశీల్దార్‌, రైతుబజార్లను తనఖా పెడుతున్నారు. -చంద్రబాబు

టీడీపీకి అండగా ఉంటామని యువత చెబుతున్నారు. జాబ్ క్యాలెండర్ అన్నారు.. మూడేళ్లుగా ఏమైంది. నా బలం, సైన్యం అంతా యువతే. మా హయాంలో రూ.16 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు తెచ్చా. కియా, హీరో, అపోలో టైర్స్‌ పరిశ్రమనలు నేనే తెచ్చా. -చంద్రబాబు

నా బాధ, ఆవేదన అంతా ప్రజల భవిష్యత్తు గురించేనని చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీ పరిపాలనలో ఎవరైనా ఆనందంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. ఎవరూ చేయని నమ్మక ద్రోహం జగన్ చేశారన్నారు. ఈ ప్రభుత్వ పాలనలో ఎక్కడ చూసినా బాదుడే బాదుడు అని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోతుందని చంద్రబాబు అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక కరెంటు ఛార్జీలు పెరిగాయన్న చంద్రబాబు.. దేశంలోనే పెట్రో ధరలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం మనదేనన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఒక్క పనైనా చేసిందా? అని ప్రశ్నించారు.

ఇవీ చదవండి:

సీఎం మారడం వల్లే రైతులు, పేదల తలరాతలు మారుతున్నాయి: సీఎం జగన్​

ఏవోబీ సరిహద్దులో 15 అడుగుల కింగ్​ కోబ్రా.. చాకచక్యంగా పట్టివేత

నిషా కనుల త్రిషా

Last Updated : Dec 25, 2022, 6:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.