సామాజిక బాధ్యతలో భాగంగా.. అట్రియా కన్వర్జెన్స్ టెక్నాలజీస్ లిమిటెడ్- యాక్ట్ ఫైబర్‌నెట్ సంస్థ విజయనగరం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో రూ.40 లక్షల వ్యయంతో పీడియాట్రిక్ మాడ్యులర్ ఐసీయూ విభాగాన్ని ఏర్పాటు చేసింది. యూనిసెఫ్ సౌజన్యంతో ఏర్పాటుచేసిన ఈ యూనిట్‌ను కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రారంభించారు. మాడ్యులర్ పీడియాట్రిక్ ఐసీయూ యూనిట్ పనితీరును.. యూనిసెఫ్ ప్రతినిధులు కేంద్ర మంత్రికి వివరించారు. 4 పడకల సదుపాయం ఉన్న ఈ యూనిట్ ద్వారా... చిన్న పిల్లలకు అత్యంత క్లిష్టమైన సమయాల్లోనూ వైద్య సదుపాయాలు అందించవచ్చని తెలిపారు.
పీడియాట్రిక్ మాడ్యులర్ ఐసీయూ యూనిట్ ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర మంత్రితో పాటు.. జిల్లా అధికారులు, భాజపా నాయకులు, యాక్ట్ కేబుల్ నెట్‌వర్క్ ఆపరేషన్స్ అధినేత డీవీ.సుబ్బారావు సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కొవిడ్ అనంతరం కూడా పిల్లల సంరక్షణ, నాణ్యమైన వైద్య సదుపాయాలు ఎంతో అవసరమని యూనిసెఫ్ వైద్యులు చెప్పారు. ఈ అవసరాల దృష్ట్యా.. యాక్ట్ ఆర్థిక సహకారంతో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఈ ఐసీయూ.. విజయనగరం జిల్లాలోని చిన్నారులకు మెరుగైన వైద్యం కోసం దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: 4 గంటల్లో 25కి.మీ స్విమ్మింగ్.. సముద్రంలో పదేళ్ల బాలిక సాహసం