విజయనగరంలో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఈనెల 27న జరిగే సిరిమాను ఉత్సవంలో మొదటి ఘట్టమైన పందిరిరాట ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
మంగళవాయిద్యాలతో..
అమ్మవారి చదురుగుడితోపాటు వనం గుడి వద్ద మంగళవాయిద్యాలు నడుమ సాంప్రదాయబద్దంగా శాస్త్రోక్తంగా పందిరి రాటలు వేశారు. ఆలయ ప్రధాన అర్చకులతోపాటు పూజారులు, పట్టణ ప్రముఖుల ఆధ్వర్యంలో ఈ ఉత్సవం అత్యంత వైభవంగా జరిపించారు. కార్యక్రమంలో అమ్మవారి ఉత్సవ ఏర్పాట్లు ఊపందుకోనున్నాయి.
ఇవీ చూడండి : సచివాలయ సిబ్బందిని చప్పట్లతో అభినందించండి: సీఎం జగన్