అనివార్య కారణాలు, పేదరికంతో మధ్యలో చదువు మానేసిన వారికి, చదువు కోవాలన్న తపన ఉన్నవారికి దూర విద్య విధానం అండగా ఉంటుంది. దీనికి సంబంధించి 2020-21 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఇటీవల ప్రకటన విడుదలైంది. నేరుగా పదో తరగతి, ఇంటరులో చేరాలనుకుంటే ఎలాంటి అపరాధ రుసుము లేకుండా అక్టోబర్ 28 వరకు ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నుట్లు అధికారులు తెలిపారు.
ఫీజు ఇలా..
పదోతరగతి: ● రిజిస్ట్రేషన్‌కు: రూ.100
●*●జనరల్ పురుష అభ్యర్థులు: రూ.1,300
●*●మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మాజీ సైనికుల పిల్లలు: రూ.900
●*ఇంటర్మీడియట్ ● రిజిస్ట్రేషన్‌కు: రూ.200
●*●జనరల్ పురుష అభ్యర్థులు: రూ.1,400
●*మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మాజీ సైనికుల పిల్లలు: రూ.1,100
అందుబాటులో కేంద్రాలు..
దూరవిద్య కోర్సులకు సంబంధించి జిల్లాలో పది, ఇంటర్ కోసం 50 కేంద్రాలున్నాయి. ప్రస్తుతం ఆరు చోట్ల నిర్వహణ లేకపోవడంతో 44 చోట్ల బోధన సాగుతోంది. అవసరమైన వారు సమీపంలోని కేంద్రాల్లో సమన్వయకర్తలను సంప్రదించవచ్ఛు సార్వత్రిక కోర్సుల్లో ప్రవేశం పొందిన వారు సాధారణ విద్యకు భిన్నంగా సెలవు రోజుల్లో ఎంపిక చేసిన కేంద్రాల్లో తరగతులకు రావాల్సి ఉంటుంది. ప్రతి విద్యార్థి కనీసం 24 తరగతులకు హాజరుకావాలి. ఈ ఏడాది కరోనా కారణంగా మినహాయింపులకు అవకాశం ఉంది.
అర్హత వివరాలు..
పదో తరగతి ప్రవేశానికి ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి 14 ఏళ్ల వయసు నిండి ఉండాలి. వీరికి ఎలాంటి విద్యార్హత, గరిష్ఠ వయోపరిమితి ఉండదు. ఇంటర్‌లో ప్రవేశానికి పదోతరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థులు తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ఏదో ఒక దానిని ఎంపిక చేసుకోవచ్ఛు
సద్వినియోగం చేసుకోవాలి
వివిధ కారణాలతో చదువు మానేసిన వారికి ఓపెన్ విద్య మంచి అవకాశం. సార్వత్రిక విద్య అభ్యసించిన ఎంతో మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధిస్తున్నారు. దీనిలో ప్రవేశం కోసం ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఐదేళ్ల వరకు చెల్లుబాటు అవుతుంది. చదువుకోవాలన్న ఆకాంక్ష ఉన్నవాళ్లు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. - అప్పలనాయుడు,సార్వత్రిక విద్య జిల్లా ఇన్‌ఛార్జి సమన్వయకర్త