ETV Bharat / state

ఎమ్మెల్యే ఇంటి ఎదుట ఆందోళన... వినతిపత్రం అందజేత - latest protest in vizianagaram

విజయనగరం ఎమ్మెల్యే వీరభద్రస్వామి ఇంటి ముందు భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చేశారు. ఏడు నెలలుగా ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు.

building construction labors protest in vizianagaram
ఎమ్మెల్యే ఇంటి ఎదుట ఆందోళన
author img

By

Published : Sep 25, 2020, 10:24 PM IST

భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ఇంటి ముందు కార్మికులు నిరసన చేపట్టారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక కొరత ఏర్పడి, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీఐటీయూ నాయకుడు జీవా అన్నారు. గత ఏడు నెలల నుంచి ఉపాధి కరవై తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని... ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు.

కార్మికుల సమస్యలపై స్పందించిన శాసనసభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి... ఆదుకునేందుకు ముఖ్యమంత్రితో సంప్రదింపులు జరుపుతామని హామీ ఇచ్చారు. జాయింట్ కలెక్టర్​తో మాట్లాడి, ఇసుక కొరత లేకుండా చూస్తామని అన్నారు.

ఇదీచదవండి.

టాటా నుంచి వైదొలగనున్న పల్లోంజీ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.