ETV Bharat / state

చావులోనూ వీడని సోదర బంధం - ఏపీలో సోదరులు ఒక్కసారిగా చనిపోయారు

Brothers Died At Once : ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు బిడ్డలు. రెండేళ్ల వ్యవధిలో జన్మించారు. పెరిగి పెద్దయ్యాక ఇద్దరు వివాహాలు చేసుకుని కుటుంబాలతో ఇరుగుపొరుగునే ఉంటున్నారు. ఇప్పుడు మృత్యువు కూడా వారిని ఒకరి వెంట ఒకరిని తీసుకుపోయిన విషాద ఘటన పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం బీకే పురంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

Brothers Died At Once
సోదరులు ఒక్కసారిగా చనిపోయారు
author img

By

Published : Dec 29, 2022, 7:44 PM IST

Brothers Died At Once: పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం బీకే పురం గ్రామానికి చెందిన గుంట పాదాలు (80), అప్పలస్వామి(78)లు అన్నదమ్ములు. రెండేళ్ల వ్యవధిలో జన్మించిన వీళ్లు పెరిగి పెద్దయ్యాక ఇద్దరు వివాహాలు చేసుకుని కుటుంబాలతో ఇరుగుపొరుగునే ఉంటున్నారు. అయితే పాదాలుకు కుమారుడు, కుమార్తె ఉండగా.. అప్పులస్వామికి ఇద్దరు కుమారులున్నారు. కొన్నాళ్ల కిందట ఇద్దరి భార్యలు మృతి చెందారు.

అనంతరం పెద్దాయన పాదాలు కుమారుడు మృతి చెందటంతో కుమార్తె ఇంట జీవిస్తున్నాడు. అలాగే చిన్నాయన అప్పలస్వామి పెద్ద కుమారుడు కూడా మృతి చెందటంతో చిన్న కుమారుడు ఆసరాతో బతుకుతున్నారు. అప్పలస్వామి చిన్న కుమారుడు సింహాచలం ప్రస్తుతం హైదరాబాదులోని కూలి పనులు చేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నాడు. దీంతో గురువారం పాదాలు మృతి చెందటంతో సింహాచలానికి చరవాణిలో సమాచారం అందించారు.

అతని రాక కోసం కుటుంబ సభ్యులంతా ఎదురు చూస్తున్న క్రమంలో గంట వ్యవధిలోనే తమ్ముడు అప్పలస్వామి మృతి చెందాడు. చిన్నతనం నుంచి కలిసి మెలిసి ఉన్న అన్నదమ్ములు ఒకరి వెంట ఒకరు మృతి చెందడంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులంతా విషాదంలో మునిగిపోయారు. ఇద్దరికి తలకొరివి పెట్టేది ఒక్కడే కుమారుడు కావడంతో అతని కోసం అంతా ఎదురు చూస్తున్నారు. అప్పలస్వామి కుమారుడు శుక్రవారం నాటికి హైదరాబాదు నుంచి గ్రామానికి చేరుకున్నాక అంత్యక్రియలు చేసేందుకు గ్రామస్థులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.