విజయనగరం జిల్లా రామతీర్ధానికి వెళ్లేందుకు ప్రయత్నించిన భాజపా, జనసేన నాయకులు, కార్యకర్తలను.. అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. స్టేషన్కు తరలించారు. భాజపా నేతలు ఎమ్మెల్సీ మాధవ్, పాకలపాటి మురళి, జనసేన నేతలు పంచకర్ల నాగ సందీప్, జనసేన లీగల్ అడ్వైజర్ యశస్వినిలను అదుపులోకి తీసుకున్నారు.
తోపులాటలో పలువురు అస్వస్థతకు గురయ్యారు. వారిని విజయనగరం పట్టణం కేంద్ర ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జనసేన డెంకాడ మండలం జడ్పీటీసీ వీర మహిళ లక్ష్మిని పట్టణంలోని తిరుమల హాస్పిటల్కి తరలించారు.
ఇవీ చూడండి: