విజయనగరం జిల్లా కురుపాం మండలం పి. లేవిడి గ్రామంలో ద్విచక్రవాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన కోటిపల్లి అప్పారావు రోడ్డు మీద నడుస్తుండగా ఒక్కసారిగా బైక్ ఢీకొంది. దీంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం అతడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి.. కరోనా వైరస్ నుంచి రక్షించు తల్లి