Bhogapuram land acquisition: విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని బొల్లింకలపాలెం, రెల్లిపేట గ్రామాలను సంక్రాంతి పండగ తర్వాత ఖాళీ చేయాలని ఆర్డీవో భవానీ శంకర్ నిర్వాసితులను ఆదేశించారు. అంతర్జాతీయ విమానాశ్రయ భూసేకరణకు సంబంధించి ఈ గ్రామాలను ఖాళీ చేయాలని తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఆయా గ్రామాల వారికి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ పూర్తిగా చెల్లిస్తామని, 3 నెలల అద్దె కూడా ఇస్తామని చెప్పారు.
ఆర్డీవో చెప్పినదానికి నిర్వాసితులు అభ్యంతరం తెలపడంతో కొంతసేపు వాగ్వాదం జరిగింది. ఖాళీ చేయడానికి తమకు కొంత సమయం కావాలని నిర్వాసితులు కోరారు. ప్రస్తుతం నిర్మిస్తున్న ఇళ్లకు బిల్లులు సక్రమంగా అందడం లేదని వాపోయారు. చర్చలు విఫలం కావడంతో అధికారులు సమావేశాన్ని ముగించి వెళ్లిపోయారు. తహసీల్దారు రమణమ్మ, డీటీ గాంధీ, రెవెన్యూ అధికారులు, నిర్వాసితులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :
Narsipuram road accident: ట్రాక్టర్‌ను ఢీకొట్టి కారు.. తాతా, మనువడు దుర్మరణం