విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో నందమూరి బాలకృష్ణ 60వ పుట్టినరోజు వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతి రాజు, నియోజకవర్గ ఇన్చార్జి అదితి గజపతి రాజు, పార్టీ నాయకులు,అభిమానులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు, రాష్ట్ర పార్టీ కార్యదర్శులు ఎస్ఎన్ఎం రాజు, కరణం శివరామకృష్ణ, మాజీ మునిసిపల్ ఛైర్పర్సన్ ప్రసాదుల కనకమహాలక్ష్మి, మండల పార్టీ అధ్యక్షులు బొద్దుల నర్సింగరావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కనకల మురళీమోహన్, పట్టణ, మండల పార్టీ ప్రధాన కార్యదర్సులు మద్దాల ముత్యాలరావు, గంటా పోలినాయుడు, జిల్లా యువత అధ్యక్షులు కర్రోతు నర్సింగరావు, మాజీ కౌన్సిలర్లు కంది మురళీనాయుడు నందమూరి అభిమానులు ముచ్చి రామలింగస్వామి, తదితరులు పాల్గొన్నారు.
ఇది చదవండి ఆర్టీసీ బస్సుల్లో మొబైల్ క్లినిక్..