విజయనగరం జిల్లా గుమ్మడం రామాలయం వద్ద సాలూరు సీఐ, ఎస్ఐ.. ప్రజలకు సైబర్ మోసాల తీరుపై అవగాహన కల్పించారు. ఆన్లైన్లో ఏ విధంగా ప్రజలను మభ్యపెట్టి డబ్బులు కాజేస్తున్నారు? ఆ సమస్యలు ఎదురైతే ఏ విధంగా ఎదుర్కోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్న విషయాలను ప్రజలకు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన కొన్ని కేసులను వివరించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదీ చదవండి: