విజయనగరం జిల్లాలో నేరాల నియంత్రణపై అవగాహన కల్పించేందుకు నేర నిరోధక అవగాహన వాహనాన్ని జిల్లా ఎస్పీ బి.రాజకుమారి ప్రారంభించారు. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలకు చట్టాలపై అవగాహన లేకపోవడంతో నేరాలకు పాల్పడుతున్నారని ఆమె అన్నారు. విద్యార్థి దశలో అవగాహనారాహిత్యం వల్ల ప్రేమ పేరుతో మోసాలకు గురవుతున్నారన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా.. జిల్లా పోలీసుశాఖ అధ్వర్యంలో చట్టాలపై అవగాహనకు పలు కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ప్రజలకు త్వరగా అర్థమయ్యే విధంగా దృశ్య శ్రవణ విధానంలో.. ఒక వాహనంలో డిజిటల్ తెరను ఏర్పాటు చేసి ప్రదర్శనలు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. చట్టాలపై అవగాహనే కల్పించడమే కాకుండా... సైబర్ సేఫ్టీ, ఉమెన్ సేఫ్టీ, రోడ్ సేఫ్టీ వంటి పలు అంశాలపై కూడా అవగాహన కల్పిస్తామని వెల్లడించారు.
ఇదీచదవండి 'సారా మత్తులో.. గర్భిణి అని చూడకుండా భార్యను హత్య చేశాడు'