ETV Bharat / state

Minister botsa Review: ‘జగనన్నకు చెబుదాం’పై ప్రతి అధికారి అప్రమత్తంగా ఉండాలి: మంత్రి బొత్స - Vizianagaram District updated News

AP MINISTER BOSTA REVIEW ON JAGANANNAKU CHEBUDAM: ‘జగనన్నకు చెబుదాం’ కార్య­క్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్న సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు వారి స‌మ‌స్యల‌పై మాట్లాడేందుకు ఫోన్ చేసినపుడు అప్యాయతతో స్పందించాలన్నారు.

AP MINISTER
AP MINISTER
author img

By

Published : May 8, 2023, 10:57 PM IST

AP MINISTER BOSTA REVIEW ON JAGANANNAKU CHEBUDAM: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘జగనన్నకు చెబుదాం’ అనే కార్య­క్రమాన్ని ఈ నెల 9వ తేదీన ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని రేపు (మంగళవారం) ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచే వచ్చే ప్రతి వినతిని పరిష్కారించటమే లక్ష్యంగా అధికారులు ముందుకుసాగనున్నారు. ఈ క్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ 'జ‌గ‌న‌న్నకు చెబుదాం' కార్యక్రమంపై అధికారులతో నేడు విజయనగరం జిల్లాలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ప్రతీ అధికారి చిత్తశుద్దితో పనిచేయాలి.. ముఖ్యమంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రజా విన‌తుల ప‌రిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇందులో భాగంగా జ‌గ‌న‌న్నకు చెబుదాం అనే కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు మరింత అప్రమ‌త్తంగా ఉండాలని.. మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. వివిధ స‌మ‌స్యల‌పై ప్రజ‌లు అందించే విన‌తుల ప‌రిష్కారంపై ప్రతి అధికారి చిత్తశుద్దితో వ్యవ‌హ‌రించాలని ఆదేశించారు.

అధికారులు వెంట‌నే స్పందించాలి.. అనంతరం ఎలాంటి ప్రజా స‌మ‌స్య ఉన్నా అధికారులు వెంట‌నే స్పందించి వాటికి త‌గిన ప‌రిష్కారం ఆలోచించాల‌ని.. మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ అధికారులకు సూచించారు. 'జ‌గ‌న‌న్నకు చెబుదాం కార్యక్రమంపై, తుఫానుపై, ముంద‌స్తు అప్రమ‌త్తపై.. అకాల వర్షాల కారణంగా పంట‌ నష్టంపై ఆయన ఉత్తరాంధ్ర జిల్లాల ప్రత్యేక అధికారి చిరంజీవి చౌద‌రి, జిల్లా ప్రత్యేక అధికారి సురేష్ కుమార్‌, జిల్లా క‌లెక్టర్ నాగ‌ల‌క్ష్మి త‌దిత‌రుల‌తో క‌లిసి మంత్రి క‌లెక్టర్ కార్యాల‌యంలో అధికారులతో సమీక్షా స‌మావేశ‌ం నిర్వహించారు.

ప్రతి అధికారి అపాయ్యంగా మాట్లాడాలి.. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..''జ‌గ‌న‌న్నకు చెబుదాం కార్యక్రమంలో ప్రజ‌ల నుంచి వ‌చ్చే విన‌తుల ప‌రిష్కారాన్ని నేరుగా ముఖ్యమంత్రి కార్యాల‌యం ప‌ర్యవేక్షణ చేస్తుంది. అందువ‌ల్ల ప్రతి విన‌తిని అధికారులు శ్రద్ధతో ప‌రిష్కరించాలి. విన‌తుల ప‌రిష్కారంలో రాష్ట్రానికే మార్గం చూపే విధంగా జిల్లా యంత్రాంగం ప‌నిచేయాలి. వివిధ వ‌ర్గాల ప్రజ‌లు, ప్రజాప్రతినిధులు అధికారుల‌కు ప‌లు స‌మ‌స్యల‌పై మాట్లాడేందుకు ఫోన్ చేసిన‌పుడు అప్యాయతతో స్పందించాలి. ప్రస్తుత ప‌రిస్థితుల్లో క‌మ్యూనికేష‌న్ సంబంధాలు పెరిగినందున ఫోన్ ద్వారానే ఎన్నో స‌మ‌స్యలను ప‌రిష్కరించే అవ‌కాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క అధికారి రేపట్నుంచి ప్రజా స‌మ‌స్యలను పరిష్కరించే పనులపై నిమగ్నమవ్వాలి.'' అని ఆయన అన్నారు.

మే 9వ తేదీ నుంచి ప్రారంభం.. ‘జగనన్నకు చెబుదాం’ అనే కార్య­క్రమం విషయానికొస్తే..ఇప్పటికే గత సభల్లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పందన కార్యక్రమానికి ప్రతిరూపంగానే ఈ జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమాన్ని రూపుదించామని వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మే 9వ తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకొస్తామన్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమంపై పలుమార్లు అన్ని జిల్లాల కలెక్టర్లతో, అధికారులతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రజల సమస్యలను నిర్దిష్టమైన సమయంలోగా పరిష్కరించి.. నాణ్యమైన సేవలను అందించడమే లక్ష్యంగా రేపు సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.