డాక్టర్.బీఆర్ అంబేడ్కర్ 129వ జయంతి విజయనగరం జిల్లా వ్యాప్తంగా అత్యంత నిరాడంబరంగా జరిగింది. కొవిడ్-19 వైరస్ కట్టడికి విధించిన లాక్డౌన్ నేపథ్యంలో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా వేడుక నిర్వహించారు. జిల్లా కలెక్టర్ హరి జవహర్లాల్ విజయనగరంలోని బాలాజీ కూడలిలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. జిల్లాలోని ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, ప్రజా ప్రతినిధులు ఆయా కార్యాలయాల్లో అంబేడ్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
ఇదీ చూడండి: