ETV Bharat / state

కర్ఫ్యూ అమలుకు ముందు... విజయనగరంలో దుకాణాలు కిటకిట!

author img

By

Published : May 5, 2021, 4:42 PM IST

నేటి నుంచి రాష్ట్రంలో పాక్షిక కర్ఫ్యూ అమలవుతున్న నేపథ్యంలో.. విజయనగరం జిల్లాలో ఉదయం నుంచే రైతుబజార్లు, మార్కెట్ల్, మద్యం దుకాణాలు కిక్కిరిసిపోయాయి.

All shops crowded in Vizianagram
All shops crowded in Vizianagram

తీవ్ర రూపం దాల్చుతున్న కరోనా వైరస్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పాక్షిక కర్ఫ్యూ ప్రకటించింది. ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకే అత్యవసర సేవలు మినహా... మిగిలిన కార్యకలాపాలపై ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాలో ఉదయం నుంచి రైతు బజార్లు, మార్కెట్లు, మద్యం దుకాణాలు కిటకిటలాడాయి.

మధ్యాహ్నం నుంచి దుకాణాలు, వ్యాపార సముదాయాలు మూసివేయనున్న కారణంగా... కొనుగోలుదారులు ఎగబడ్డారు. ప్రధానంగా జిల్లా కేంద్రం విజయనగరంలో కొనుగోలు ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోయాయి. ప్రధాన రైతు బజార్లు, మార్కెట్ వీధులు, మద్యం దుకాణాల ప్రాంతాలన్నీ జనసందోహంగా మారాయి.

ఇదీ చదవండి:

అంత్యక్రియలకు భారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.