లాక్డౌన్ సడలింపులతో ఆర్టీసీ బస్సులు ప్రజా రవాణాకు బయల్దేరాయి. ఉదయం 7 గంటల నుంచే రాకపోకలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 4 డిపోల్లో 70 సర్వీసులను అధికారులు ప్రారంభించారు. విశాఖపట్నం, పాలకొండ, శ్రీకాకుళం, శృంగవరపుకోట, అనకాపల్లి ప్రాంతాలకు సర్వీసులు కొనసాగుతున్నాయి.
సాలూరు డిపో నుంచి విశాఖ, విజయనగరం, పార్వతీపురం, రాజాం, బొబ్బిలికి బస్సులు నడుపుతున్నారు. పార్వతీపురం నుంచి విశాఖ, విజయనగరం, గుమ్మలక్ష్మీపురం, సాలూరు, పాలకొండకు సర్వీసులు నడుస్తున్నాయి. శృంగవరపుకోట డిపో నుంచి ధర్మవరం, విశాఖ, అరకుకు బస్సులు తిప్పుతున్నారు.
నాన్ స్టాప్ బస్సుల్లో మాత్రమే టిక్కెట్లు అన్ లైన్ బుకింగ్ ఏర్పాటు చేశారు. మిగిలిన అన్ని రకాల బస్సుల్లో అక్కడకక్కడే పాయింట్ల వద్ద గ్రౌండ్ బుకింగ్ ద్వారా ప్రయాణికులకు టికెట్లు జారీ చేస్తున్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా అధికారుల సూచనల మేరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సిబ్బంది వెల్లడించారు.
ఇవీ చూడండి: