ETV Bharat / state

'ఏ ప్రయోజనాలు ఆశించి ఈ నిర్ణయం తీసుకున్నారు' - acta meeting in vizianagaram

విజయనగరంలోని మహారాజా కళాశాల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ... ఏసీటీఏ సభ్యులు సమావేశమయ్యారు. ఏ ప్రయోజనాలు ఆశించి ఈ నిర్ణయం తీసుకున్నారో తెలపాలని డిమాండ్ చేశారు.

ACTA members meeting in vizianagaram
ఏసీటీఏ సభ్యుల సమావేశం
author img

By

Published : Oct 9, 2020, 5:33 PM IST

విజయనగరంలోని మహారాజ స్వయం ప్రతిపత్తి డిగ్రీ కళాశాల ప్రైవేటీకరిస్తూ .. మాన్సాస్ ట్రస్ట్ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ఎఫిలెటెడ్ కళాశాలల ఉపాధ్యాయల అసోసియేషన్(ఏసీటీఏ) సమావేశమైంది. ఈ సమావేశానికి ఏసీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్​రావు, కళాశాల ఏసీటీఏ ఛైర్మన్ చిన్నారావు హాజరయ్యారు.

మహారాజా కళాశాల వ్యవహారంలో... మాన్సాస్ ట్రస్టు నిర్ణయంపై ఏసీటీఏ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస సమాచారం లేకుండా.. అధ్యాపకులు, విద్యార్ధుల అభిప్రాయలను పరిగణలోకి తీసుకోకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం విచారకరమన్నారు. ఏ ప్రయోజనాలు ఆశించి ఈ నిర్ణయం తీసుకున్నారో తెలపాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, మహారాజా కళశాల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో తీవ్ర స్థాయి ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

ఇదీచదవండి.

పేదల ఆకలి తీర్చే 'డబ్ల్యూఎఫ్​పీ'కి నోబెల్​ శాంతి బహుమతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.