విజయనగరం జిల్లా రామభద్రాపురంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో... ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. హాస్టల్లో మొత్తం 104 మంది విద్యార్థులు ఉన్నట్లు హాజరు పట్టికలో ఉందని... కానీ 82 మంది మాత్రమే ఉన్నారని ఏసీబీ సీఐ సతీష్ తెలిపారు. స్టాక్ రికార్డులో చూపించిన దానికి... నేరుగా చూసిన దానికి చాలా తేడా ఉందన్నారు. విద్యార్థుల రూములు... మరుగుదొడ్ల సరిగా లేవన్నారు. రికార్డులు పరిశీలించిన అనంతరం నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని సీఐ సతీష్ కుమార్ చెప్పారు.
ఇదీ చూడండి: అనిశా వలలో బీసీ సంక్షేమ శాఖ సహాయక అధికారి