మహారాజా కళాశాలను ప్రైవేటీకరణ చేయొద్దంటూ విజయనగరంలోని మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటిని ఏబీవీపీ విద్యార్థులు ముట్టడించారు. వేలాది విద్యార్థులు చదువుకునే కళాశాలను మాన్సాస్ ట్రస్ట్ ప్రైవేటీకరణ చేయటం సరికాదన్నారు. మంత్రి బొత్స ఇంట్లో లేని కారణంగా.. ఆయన సతీమణి ఝాన్సీలక్ష్మి విద్యార్థులతో ఫోన్లో మాట్లాడారు.
ఎంఆర్ కళాశాల వివాదం తనకు తెలుసునని.. తను కూడా ఆ కళాశాల పూర్వ విద్యార్థినేనని బొత్స విద్యార్థులతో అన్నారు. ప్రైవేటీకరణ జరగకుండా తనవంతు ప్రయత్నం చేస్తానని ఈ విషయమై కలెక్టర్‌కు సైతం వినతిపత్రం అందించాలని విద్యార్థులకు సూచించారు. బొత్స సతీమణి ఝాన్సీ మాట్లాడుతూ... విద్యార్థుల ఆందోళలనలను మాన్సాస్ ఛైర్పర్సన్ సంచైత అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:
మహారాజ కళాశాలను ప్రైవేటీకరించాల్సిన అవసరం ఏముంది?: అశోక్‌గజపతిరాజు