ETV Bharat / state

'రహదారులకు తక్షణమే మరమ్మతులు చేయాలి' - vizianagaram news updates

విజయనగరంలో ఆమ్​ ఆద్మీ పార్టీ నేతలు ఆందోళన చేశారు. జిల్లాలోని రోడ్లన్నీ ధ్వంసమై, అధ్వాన్నంగా మారాయని మండిపడ్డారు. తక్షణమే రహదారులను బాగుచేయాలని డిమాండ్ చేశారు.

AAP leaders protest in vizianagaram
విజయనగరంలో ఆమ్​ఆద్మీ పార్టీ నేతల ఆందోళన
author img

By

Published : Oct 30, 2020, 5:04 PM IST

జిల్లాలో అధ్వాన్నంగా మారిన రోడ్లతో ప్రజలు అవస్థలు పడుతున్నా... ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడం దారణమని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ దయానంద్ అన్నారు. ధ్వంసమైన రహదారులను బాగుచేయాలని డిమాండ్ చేస్తూ... విజయనగరంలో నిరసన చేపట్టారు.

ఎత్తు బ్రిడ్జి నుంచి ఆర్అండ్​బీ వైపు వెళ్లే రోడ్డు.. సంవత్సరం తిరగకముందే ధ్వంసమైందని అన్నారు. వీటి మరమ్మతులకు ప్రజాధనం దుర్వినియోగం అయిందే తప్ప.. ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్​పై రూపాయి సెస్ విధించిన ప్రభుత్వం... అదీ చాలక రహదారి భద్రత పేరుతో భారీ జరిమానాలకు తెరలేపిందని మండిపడ్డారు. రహదారులు సరిగా లేకుండా జరిమానాలు వేయడం ఏమిటని ప్రశ్నించారు. తక్షణమే జిల్లాలోని రోడ్లను బాగుచేయాలని డిమాండ్ చేశారు.

ఇదీచదవండి.

క్రికెట్ బెట్టింగ్ కేంద్రంపై పోలీసుల ఆకస్మిక దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.