గులాబ్ తుపాను(gulab cyclone) ప్రభావంతో ఉత్తరాంధ్రలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు జిల్లాలోని పాచిపెంట మండలంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో గిరిజన గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పాచిపెంట మండలం కేరంగి పంచాయతీలోని పనుకువలసకు చెందిన చోడిపల్లి బంగారమ్మ అనే బాలింతను తీసుకెళ్లేందుకు గిరిజనులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
రోడ్డు కోతకు గురికావడమే కాక వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో గిరిజనులు తమ ప్రాణాలకు తెగించి సాహసం చేశారు. డోలి సాయంతో ఆ బాలింతను వాగు దాటించారు. పనుకువలస నుంచి పూడి వరకు కోతకు గురైన మార్గంలో సుమారు 4 కిలోమీటర్ల వరకు డోలిలో తీసుకెళ్లారు. వర్షం పడిందంటే తమ కష్టాలు వర్ణణాతీతం అని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదంవడి..
GULAB CYCLONE: గులాబ్ కుదిపేసింది..శ్రీకాకుళం నుంచి కృష్ణా వరకు వణికించింది