Elephants Attack in Vizianagaram: ఏనుగుల దాడిలో అటవీ శాఖ ఉద్యోగి మృతి చెందాడు. ఈ విషాద సంఘటన విజయనగరం జిల్లాలోని కొమరాడ మండలం దుగ్గి గ్రామ సమీపంలో జరిగింది. నిమ్మక రాజాబాబు (22) అటవీ శాఖలో ఎలిఫెంట్ ట్రాకర్‌గా పని చేస్తున్నాడు.
ఏనుగులు రాకుండా మంటపెడుతుండగా.. ఉన్నట్టుండి మంట ఆరిపోయింది. దీంతో.. ఒక్కసారిగా ఏనుగుల గుంపు రాజాబాబుపైకి దూసుకొచ్చాయి. తప్పించుకునేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. వెంటనే రాజాబాబును ఏనుగులు తొక్కి చంపేశాయి. మృతుడిది శ్రీకాకుళం జిల్లాలోని కె.గుమడ గ్రామం అని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:
కరోనా కొత్త వేరియంట్ 'డెల్టాక్రాన్'- ఒమిక్రాన్, డెల్టా కలయికతో..