విజయనగరం జిల్లా పార్వతీపురం పురపాలక సంఘం చర్చి వీధిలో గ్రంథాలయం పక్కన భారీ వృక్షం నేలకూలింది. ఈ క్రమంలో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. విద్యుత్ సిబ్బంది మరమ్మతు చర్యలు చేపట్టారు.
ఇదీ చూడండి..