విజయనగరం జిల్లాలోని బాబామెట్ట దర్గా దర్బార్లో.. హజరత్ తాజ్ ఖాదర్ వలీబాబా 62వ మహా సూఫీ సుగంధ మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి ఖురాన్ పఠనం, ప్రత్యేక ప్రార్ధనలతో ఈ మహోత్సవాలు ప్రారంభమవుతాయని దర్బార్ ముతవల్లి (ధర్మకర్త) మహమ్మద్ అతావుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ బాబా తెలిపారు. అనంతరం జెండా ఉత్సవం, ఛాదర్ సమర్పణ వంటి ఉత్సవ కార్యక్రమాలతో పాటు ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయని పేర్కొన్నారు. అదేవిధంగా రెండో రోజు బుధవారం ఉదయం ఆరు గంటల నుంచి ఖాదర్ బాబా దర్గా షరీఫ్ వద్ద ఖురాన్ పఠనం ఉంటుందని తెలిపారు.
ఉదయం 10 గంటలకు దర్భార్ షరీఫ్ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై.. హజరత్ తాజ్ ఖాదర్ వలీ బాబా, నషాన్, చాదర్, సందల్ షరీఫ్లతో పాటు ఫకీరు మేళా ఖవ్వాలితో నగర పుర వీధుల్లోకి ఊరేగింపు నిర్వహిస్తామన్నారు. చాదర్ సమర్పణ, దుప్తార్ బందీ, సలాం వంటి కార్యక్రమాలతో ఉరుసు మహోత్సవాలు ముగిస్తాయని ధర్మకర్త అతావుల్లా బాబా పేర్కొన్నారు. వేడుకలకు వచ్చే భక్తులు.. తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ధర్మకర్త అతావుల్లా బాబా తెలిపారు.
ఇదీ చదవండి: