ETV Bharat / state

కోలుకున్న నలుగురు కోవిడ్ బాధితులు డిశ్చార్జ్

author img

By

Published : May 20, 2020, 8:10 AM IST

విజయనగరం జిల్లాలో కరోనా వైరస్ బారినపడి కోలుకున్న వారిలో నలుగురు డిశ్చార్జ్ అయ్యారు. వారికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందించి పండ్లు, శానిటైజర్లు, మాస్కులు ఇచ్చి పంపించారు.

4 covid patients discharge form viziangagaram dst covid hospital

విజయనగరం జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకున్న నలుగురు... జిల్లా కొవిడి ఆసుపత్రి మిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వారికి ఆసుపత్రి సిబ్బందితో పాటు... కలెక్టర్ హరి జవహర్ లాల్, ఎస్పీ రాజకుమారి, జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారిణి రమణ కుమారి, విజయనగరం శాసనసభ్యుడు వీరభద్రస్వామి పుష్పగుచ్చాలు అందచేశారు. అభినందనలు తెలియచేశారు.

ఒక్కో బాధితునికి రాష్ట్ర ప్రభుత్వం తరపున 2 వేల రూపాయల నగదు, పండ్లు, శానిటైజర్, మాస్క్ అందజేశారు. అనంతరం కరతాళ ధ్వనులతో వారికి వీడ్కోలు పలికారు. కరోనా బాధితులకు చికిత్స అందించిన డా. సుబ్రహ్మణ్య హరికిషన్ నేతృత్వంలోని వైద్యులు, నర్సుల బృందాన్ని సైతం అధికారులు, ప్రజాప్రతినిధులు అభినందించారు.

ఇదీ చూడండి:

ఆగస్టు 3న పాఠశాలలు పునఃప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.