విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో మాస్క్, చొక్కా సాయంతో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరణించిన వ్యక్తి బాబమెట్ట ప్రాంతానికి చెందిన పంకజ్ శ్రీనివాస్ మిశ్రా (24)గా పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ ఎంటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. మృతుడి తండ్రి నాగేంద్ర కుమార్ ప్రధాన ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు.
ఉద్యోగం రాలేదనే మనస్థాపం చెందిన శ్రీనివాస్ పైప్లైన్కు మాస్కు సహాయంతో చొక్కా చుట్టుకుని ఉరి వేసుకున్నాడు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై బాలాజీరావు తెలిపారు.
ఇదీ చదవండి :