విశాఖ జిల్లా అనకాపల్లిలోని దేముని గుమ్మంలో నివసిస్తున్న సయ్యపు రెడ్డి అప్పారావు, అపరంజికి.. కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు సతీష్ కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. సతీష్ మద్యానికి బానిసవ్వటంతో వివాహం జరగలేదు. రోజులాగే ఆదివారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన సతీష్.. టిఫిన్ చేయమని తల్లిని అడిగాడు. ఈ సమయంలో చిన్న వివాదం జరిగింది. లోనికి వెళ్లి తలుపు వేసుకున్న సతీష్.. సోమవారం ఉదయం ఎంతకు బయటికి రాకపోవంతో కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది. దీంతో వారు సతీష్ ఉన్న గది తలుపు కొట్టగా తీయలేదు. వెంటనే తలుపులు పగలగొట్టి చూడగా ఉరి వేసుకుని ఉన్నాడు.
కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో వారు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.
ఇదీ చదవండి:
viveka murder case: వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరిని ప్రశ్నిస్తున్న అధికారులు