విశాఖ జిల్లాలోని రేవుపోలవరం వద్ద సముద్రంలో ఆదివారం యువకుడు గల్లంతయ్యాడు. దేవరాపల్లి మండలం కోరాడ గ్రామానికి చెందిన వెంకటేష్(18) రేవుపోలవరం సమీపంలోని రొయ్యల పరిశ్రమలో పని చేస్తున్నాడు. వెంకటేశ్ మరో ఇద్దరు యువకులు కలిసి ఆట విడుపు కోసం ఆదివారం సముద్ర తీరానికి వెళ్లారు. నీళ్లలో దిగి స్నానం చేస్తుండగా భారీ కెరటం వెంకటేశ్‌ను లోనికి తీసుకుపోయింది. సమాచారం అందుకున్న మెరైన్ పోలీసులు గాలింపు చర్యల్లో నిమగ్నమయ్యారు.
ఇదీ చదవండి