ETV Bharat / state

విశాఖలో కొవిడ్ రోగులకు 'యోగభారతి' ట్రస్టు సేవలు

కొవిడ్​ వల్ల ఎంతోమంది ఆకలితో అలమటిస్తున్నారు. అలాంటివారి కోసం విశాఖలో యోగభారతి ట్రస్టు సేవలందిస్తోంది. క్వారంటైన్​లో ఉంటున్న పేదవారికి అండగా ఉంటున్నారు. ఇలాగే రోజు 100 కుటుంబాలకు భోజనాన్ని అందిస్తున్నారు.

covid
విశాఖలో కోవిడ్ రోగులకు యోగభారతి ట్రస్టు సేవలు
author img

By

Published : May 22, 2021, 4:37 PM IST

కొవిడ్ రెండో దశ విజృంభణ వేళ... అత్యధిక సంఖ్యలో విశాఖ నగర వాసులు మహమ్మారి బారిన పడుతున్నారు. వీరిలో చాలామంది ఆసుపత్రికి వెళ్లలేక, ఇళ్లలోనే చికిత్స పొందుతున్నారు. ఇళ్లలోనే ఉంటూ విపత్కర పరిస్థితుల్లో కనీసం సరైన పోషకాహారం తీసుకోలేని వారు చాలామందే ఉన్నారు. ఇలాంటి సమయంలో మేమున్నామంటూ యోగభారతి ట్రస్టు.. వాళ్ల అవసరం గుర్తించి, అలాంటి వారి ఇళ్లకు సేవకుల ద్వారా పోషకాహారాన్ని అందిస్తోంది.

covid
విశాఖలో కోవిడ్ రోగులకు యోగభారతి ట్రస్టు సేవలు

యోగ భారతి ట్రస్టు వ్యవస్థాపకులు, యోగా గురువు పైడింనాయుడు తన వాలంటీర్ల ద్వారా సేవలందించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గత వారం రోజులుగా తెలిసిన వారి ద్వారా ఎవరికైతే ఆహారం అవసరమో గుర్తించి, వారి పేర్లు నమోదు చేసుకున్నారు. దాతల సహకారంతో ప్రతీరోజూ ఉదయం ఆహారం వండి ప్యాకెట్ల రూపంలో ఇళ్లకు వెళ్లి అందిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం స్వర్ణభారతి స్టేడియంలో అక్కడే వంట చేసి ప్యాకింగ్ చేసి హోమ్ క్వారంటైన్​లో ఉంటున్న రోగులకు ఉచిత భోజనాన్ని అందిస్తున్నారు.

గత వారం రోజుల క్రితం 50 మందికి ప్రారంభించి, ప్రస్తుతం రోజుకు 100 మందికి ఆహారం అందిస్తున్నారు. కర్ఫ్యూ నిబంధనలు పాటిస్తూ సేవా కార్యక్రమానికి తక్కువమంది సేవకులను మాత్రమే అనుమతిస్తున్నారు.

ఇదీ చూడండి.

ఇంకా అందని బెయిల్ పత్రాలు.. ఎంపీ రఘురామ సోమవారం విడుదలయ్యే అవకాశం!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.