ETV Bharat / state

విశాఖపట్నం మహా నగర పాలక సంస్థ.. వైకాపాదే! - municipal elections 2021 results

రాష్ట్రమంతా ఆసక్తి రేపిన మహా విశాఖ నగరపాలక సంస్థపై.. వైకాపా జెండా ఎగిరింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం ఈ ఎన్నికల్లో కొంత ప్రభావమే చూపింది. పెందుర్తి, గాజువాక, భీమిలి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని... జీవీఎంసీ డివిజన్లలో తెలుగుదేశం ఆధిపత్యం ప్రదర్శించగా.. మిగతా నియోజగవర్గాల్లో లభించిన మద్దతుతో అధికారపార్టీ 58 స్థానాలు గెలుచుకుంది..

విశాఖ వైకాపాదే!
విశాఖ వైకాపాదే!
author img

By

Published : Mar 15, 2021, 7:20 AM IST

విశాఖ వైకాపాదే!

విశాఖ కార్పొరేషన్‌లో మొత్తం 98 డివిజన్లలో 58 చోట్ల వైకాపా విజయదుందుభి మోగించింది. స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ అంశం ఈ ఎన్నికల్లో కొంతమేరకే ప్రభావమే చూపింది. ఉక్కు పరిశ్రమ ఉన్న గాజువాకలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. గాజువాక నియోజకవర్గ పరిధిలోని 20 డివిజన్లలో... వైకాపా 8 గెలుచుకుంది. తెలుగుదేశం 9 చోట్ల విజయం సాధించగా... అదే ప్రాంతంలో ఆ పార్టీ మద్దతుతో 72, 78 డివిజన్లలో పోటీ చేసిన సీపీఎం, సీపీఐ అభ్యర్థులు విజయం సాధించారు.

మరో స్థానంలో జనసేన అభ్యర్థి గెలుపొందారు. పెందుర్తి శాసనసభ నియోజకవర్గ పరిధిలోని 5 డివిజన్లలో.. తెలుగుదేశం 4 , వైకాపా ఒక డివిజన్లో గెలిచాయి. భీమిలిలో సైకిల్‌ సత్తా చాటింది. మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గ పరిధిలోని తొమ్మిది వార్డుల్లో 5 స్థానాలను తెలుగుదేశం గెలుచుకుంది. మొత్తంగా తెలుగుదేశం అభ్యర్థులు 30 వార్డులను కైవసం చేసుకున్నారు. జనసేన 3 వార్డులు సొంతం చేసుకుంది. 4 వార్డుల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధించారు. భాజపా, సీపీఐ, సీపీఎం ఒక్కో వార్డులో గెలిచారు.

తెలుగుదేశం పార్టీ మేయర్ అభ్యర్థిగా పెందుర్తి 96వ డివిజన్ నుంచి బరిలో నిలిచిన పీలా శ్రీనివాసరావు అందరికంటే అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. ప్రత్యర్థిపై 6వేల 290 ఓట్ల అధిక్యంతో విజయదుందుభి మోగించారు. మంత్రి ముత్తంశెట్టి కుమార్తె ప్రియాంక ఆరో వార్డులో గెలిచారు. 26వ వార్డు నుంచి యువ వైద్యురాలు.. తెదేపా అభ్యర్థి ముక్కా శ్రావణి విజేతగా నిలిచారు. 21వ డివిజన్ నుంచి పోటీ చేసిన వైకాపా నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ విజయం సాధించారు. పార్టీ మేయర్ అభ్యర్థిగా ఆయన పేరు బలంగా వినిపిస్తోంది.

ఫలితాల తర్వాత విశాఖ బీచ్ రోడ్‌లో వైకాపా సీనియర్ నేతలు విజయోత్సవాలు చేసుకున్నారు. వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీ విజయ సాయి రెడ్డి, ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత బీచ్ రోడ్ లోనే ర్యాలీ తీశారు. వార్డుల్లో గెలిచిన అభ్యర్థులు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

ఇవీ చదవండి:

'గెలుపోటములకు అతీతంగా ప్రజల కోసం పోరాడతాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.