కుటుంబ వ్యవస్థతో, సమాజ స్పర్శతో జీవన సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చని వీఎంఆర్డీఏ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ సెల్ ఆధ్వర్యంలో 'సామాజిక- ఉద్వేగపూరిత విద్యార్జన' అంశంపై నిర్వహించిన కార్యశాలకు హాజరయ్యారు. పలు విషయాలను విద్యార్థులతో పంచుకున్నారు. గతంలో యువతకు కుటుంబ వ్యవస్థతో, సాంస్కృతిక వినోద కార్యక్రమాలతో అనుబంధం ఉండేదన్నారు. ప్రస్తుతం ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యార్జనతోనే సమయం గడిచిపోతోందని చెప్పారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ సెల్ సమన్వయకర్త డాక్టర్ ఎస్ హరినాథ్, సాఫ్ట్స్కిల్ ట్రైనర్ డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: