కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా విశాఖ మహిళా సంఘాల ఐక్యవేదిక సభ్యులు బైక్ ర్యాలీని నిర్వహించారు. విశాఖ జీవీఎంసీ కార్యలయంలోని గాంధీ విగ్రహం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు చేపట్టిన ఈ ర్యాలీని ఏయూ విశ్రాంత ఆచార్యులురాలు ఎన్ నిర్మల ప్రారంభించారు. దేశంలోని 60 శాతానికి పైగా మహిళలు వ్యవసాయ రంగంలో ఉపాధి పొందుతున్నారని మహిళా సంఘాల నేతలు అన్నారు. కానీ భుమిపై యాజమాన్య హక్కు లేకపోవడంతో 12 శాతం మందిని మాత్రమే మహిళా రైతులుగా గుర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నూతన వ్యవసాయ చట్టాలును అమలుపరిస్తే రైతులు, శ్రామిక మహిళలు ఉపాధిని పూర్తిగా కోల్పోతారని తెలిపారు. దేశంలో ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుందని పేర్కొన్నారు. ఈ చట్టాలను కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిందని విమర్శించారు.