ETV Bharat / state

కరోనా భయం... తీసింది ప్రాణం - corona fear anakapalli woman suicide

కరోనా భయం నిండు ప్రాణాన్ని తీసింది. తల్లి, అన్నయ్యకు కరోనా సోకుతుందేమోనన్న ఆందోళన ఆత్మహత్యకు దారితీసింది. విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన ఓ యువతికి కొవిడ్ సోకింది. తన కుటుంబ సభ్యులకు వైరస్ వ్యాపిస్తుందన్న భయంతో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. యువతి ఆత్మహత్యపై ఆమె అన్నయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కరోనా భయం... తీసింది ప్రాణం
కరోనా భయం... తీసింది ప్రాణం
author img

By

Published : Aug 15, 2020, 11:13 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లిలో కరోనా సోకిన యువతి ఆత్మహత్య చేసుకుంది. అనకాపల్లి ఉప్పలవారి వీధిలో నివాసం ఉంటున్న లింగం అనురాధ (32) దువ్వాడలోని ఓ ప్రైవేటు కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్​గా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి, అన్నయ్యతో ఉంటున్న అనురాధకి కరోనా సోకింది. రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. వైరస్.. తన తల్లి, అన్నయ్యకు సోకుతుందని ఆందోళనతో ఫ్యాన్​కి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

అనురాధ ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె అన్నయ్య నరసింగరావు అనకాపల్లి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు అనకాపల్లి పట్టణ ఎస్సై రామకృష్ణ తెలిపారు. మృతదేహానికి అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.

ఇదీ చదవండి : 'ఫ్రంట్ లైన్ వారియర్స్​కి కావాల్సింది సెల్యూట్ కాదు... పీపీఈ కిట్లు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.