ETV Bharat / state

రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల పరిశీలన

రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల పరిశీలన కార్యక్రమం కొనసాగుతోంది. నామ పత్రాలను అధికారులు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు.

Withdrawal of Nomination
రాష్ట్రంలో కోలాహలంగా నామినేషన్ల పరిశీలన
author img

By

Published : Mar 14, 2020, 6:18 PM IST

రాష్ట్రంలో కోలాహలంగా నామినేషన్ల పరిశీలన

స్థానిక సంస్థల నిమిత్తం.. రాష్ట్ర వ్యాప్తంగా దాఖలైన నామినేషన్ల పరిశీలన కొనసాగుతోంది. ఇదే సమయంలో.. నామినేషన్ల ఉపసంహరణ కూడా కొనసాగుతోంది. విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలో 80 మంది అభ్యర్థులు.. నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. చోడవరం మండలం లక్ష్మీపురం సెగ్మెంట్లో వైకాపా అభ్యర్థి అబ్బాయి నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చోడవరం మండలంలో 47 మంది అభ్యర్థులు నామినేషన్లు వెనక్కు తీసుకున్నారు. చోడవరం జడ్పీటీసీగా తెదేపా అభ్యర్థి పల్లా గణేశ్వరీ, వైకాపా అభ్యర్థి మారిశెట్టి విజయ.. బరిలో నిలిచారు.

చిత్తూరు జిల్లాలో...

చిత్తూరు జిల్లా పుత్తూరు మున్సిపాలిటీలో నామినేషన్లు పరిశీలన జోరందుకుంది. పట్టణంలో ఐదు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు కాగా.. అధికారులు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు.

అనంతపురంలో ఉపసంహరణలు..

అనంతపురంలో జడ్పీటీసీలుగా పోటీలో ఉన్న అభ్యర్థుల్లో.. చాలా మంది నామపత్రాలు ఉపసంహరించుకుంటున్నారు. ఈ పరిణామంపై.. పార్టీల్లో రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

చీరాలలో నామినేషన్ల పరిశీలన..

ప్రకాశం జిల్లా చీరాలలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. పట్టణంలోని 33 వార్డులకు 318 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారి నామపత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారని చీరాల మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి తెలిపారు. మరోవైపు.. ఇంతవరకు ఆభ్యర్ధుల తరపున ఏ రాజకీయ పార్టీలు బీ-ఫారాలు సమర్పించకపోవటం.. బరిలో ఉన్నవారిలో ఆందోళన కలిగిస్తోంది.

కడప నగరపాలికలో..

కడప నగరపాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లకు నామినేషన్ పత్రాల పరిశీలన కార్యక్రమం ముగిసింది. ప్రమాణాల పరంగా దాఖలు కాని నామపత్రాలు తిరస్కరించారు. అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

జంగారెడ్డి గూడెంలో..

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో జడ్పీటీసీ స్థానాన్ని వైకాపా నాయలుకు కైవసం చేసుకుందుకు పావులు కదుపుతున్నారు. వైకాపా నుంచి పొల్నాటి బాబ్జి నామినేషన్ వేయగా... తెదేపా నుంచి పులపాకుల సత్యనారాయణ, పారేపల్లి నరసింహమూర్తిలు నామపత్రాలు దాఖలు చేశారు. పులపాకుల సత్యనారాయణ నామినేషన్ ఉపసంహరించుకున్నారు. పారేపల్లి నరసింహ మూర్తిపై వైకాపా నాయకులు గురి పెట్టారు. శుక్రవారం రాత్రి నుంచి బంధువుల ద్వారా ఒత్తిడి తీసుకు రాగా... ఉదయం తెదేపా నాయకులు స్వగ్రామం టెక్కినవారిగూడెం వెళ్లి బుజ్జగించారు. వీరిలో కొంత మంది వైకాపా నాయకులు వెళ్లి అభ్యర్థి నరసింహ మూర్తిని కారులో ఎక్కించుకుని ఏలూరు తీసుకు వెళ్లారు. పోలీసులు అక్కడే ఉన్నా ఏ మాత్రం పట్టించుకోలేదని తెదేపా నాయకులు ఆరోపించారు.

ఇవీ చదవండి:

'రాష్ట్రంలో చట్టం-నేరం కలిసి ప్రయాణిస్తున్నాయి'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.