విశాఖ జిల్లా ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో మద్యం దుకాణాలన్నీ బోసిపోయాయి. ప్రభుత్వం మద్యం ధరలను భారీగా పెంచడం వల్ల మద్యం అమ్మకాలు బాగా తగ్గిపోయాయి. రోజూ పట్టణంలోని అన్ని మద్యం దుకాణాల వద్ద కిలోమీటర్ల పొడవునా ఉన్న జనం.... ధరలు పెంచిన నాటి నుంచి రావడం మానేశారు. ఎలమంచిలి పట్టణంలో రోజుకు కోటి రూపాయల మద్యం అమ్మకాలు జరగ్గా... ధరలు పెంచిన తర్వాత వీటి అమ్మకాలు పది లక్షల రూపాయలకు పడిపోయాయి. దుకాణాల వద్ద పోలీసుల సంఖ్య కంటే కొనుగోలుదారుల సంఖ్య తక్కువగా కనిపించింది.
ఇదీ చదవండి :