తనపై హోం మంత్రి సుచరిత గతంలో ఆరోపణలు చేశారని, ఆమెను కూడా అరెస్టు చేస్తారా?"అని తెదేపా నేత అయ్యన్నపాత్రుడు అన్నారు.
విశాఖ జిల్లా నర్సీపట్నంలో కార్యకర్తలతో ఏర్పాటైన సమావేశంలో అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. విశాఖ మన్యంలో గంజాయి రవాణాపై ప్రస్తావించిన తెలుగుదేశం పార్టీ నాయకులు నక్క ఆనంద్ బాబుకు జారీ చేసిన నోటీసు మాదిరిగానే విశాఖ జిల్లాలో తనకు, మరో మాజీ మంత్రికి నోటీసులు జారీ చేస్తామని పోలీసులు ఉన్నతాధికారులు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు.
గంజాయి అక్రమ రవాణా తాము అరికడితే మరి పోలీసులు ఎందుకని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. ఇటీవల కాలంలో కోట్లాది రూపాయల డ్రగ్స్ పట్టుబడిన కేసులో విజయవాడ ప్రధాన కేంద్రంగా తేలిందని దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులు జరగడం వెనక పోలీసులు సహకారం ఉందని ఆయన ఆరోపించారు.
'సమాధానం చెబుతాం'
రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులు చేసిన వారికి త్వరలోనే సమాధానం చెబుతామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చింతకాయల అయ్యన్నపాత్రుడు తనయుడు చింతకాయల విజయ్. తెదేపా కార్యాలయాలపై దాడులకు పాల్పడిన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా నర్సీపట్నంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియం వద్ద నిరసన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: Minister Botsa: మావోయిస్టు పార్టీకి తెదేపాకు మధ్య తేడా లేదు: మంత్రి బొత్స