ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు అన్నారు. విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం చౌడువాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసి.. శిలాఫలకం ఆవిష్కరించారు. ఆరోగ్య కేంద్రం ద్వారా మరిన్ని వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య శాఖ అధికారులు, వైకాపా నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: విశాఖలో సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ పర్యటన