మావోయిస్టు ప్రాబల్య ప్రాంతమైన బలపం, కోరుకొండ, సీలేరు, దారకొండ ప్రాంతాల్లో గోడ పత్రులు కలకలం రేపుతున్నాయి. విశాఖ జిల్లా మన్యంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా పలు ప్రాంతాల్లో గోడ పత్రికలు వెలిశాయి. గతంలో పలు ప్రాంతాల్లో మావోయిస్టు అమరవీరుల కోసం నిర్మించిన స్థూపాల పైన.. మావోయిస్టులకు వ్యతిరేకంగా వీటిని అంటించారు. అల్లూరి ఆదివాసీ అభివృద్ధి సమితి పేరుతో.. వారోత్సవాలతో ఆదివాసీ గిరిజనులకు ఒరిగేదేమిటి.. రహదారులు, సెల్ టవర్లు నిర్మాణాలకు అడ్డుతగులుతున్నారంటు దుయ్యబట్టారు. గిరిజనులు చంపి మీరు వారోత్సవాలు ఎలా చేసుకుంటారంటూ గోడ పత్రుల్లో ప్రశ్నించారు.
ఇవీ చూడండి...